కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇలిచిపూర్ లోని శ్రీ సరస్వతి మహా క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రులలో భాగంగా ఏడవ రోజు ఆదివారం సరస్వతి అమ్మవారు మహా చండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.