ఎక్సైజ్ సూపరిండెంట్ ముకుంద రెడ్డికి గౌడ ఉద్యమ నాయకుల శుభాకాంక్షలు

613చూసినవారు
ఎక్సైజ్ సూపరిండెంట్ ముకుంద రెడ్డికి గౌడ ఉద్యమ నాయకుల శుభాకాంక్షలు
కామారెడ్డి జిల్లా నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని, జిల్లా జై గౌడ ఉద్యమ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ జిల్లా అధ్యక్షుడు రంగోల మురళీధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు కర్రోల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్ లు ముకుంద రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్ గౌడ్, జిల్లాలో జై గౌడ ఉద్యమం తరఫున చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి సూపరిండెంట్‌కు వివరించారు.

సంబంధిత పోస్ట్