కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో సంబల్‌పూర్ నుండి పూణే వెళ్తున్న సాంగవళి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్: 20809) లో ఎక్సైజ్ మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులు సంయుక్తంగా మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ శ్రీ పి. శ్రీధర్ మరియు కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి శ్రీ బి. ముకుందరెడ్డి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.