కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు: షబ్బీర్ కృషికి కాంగ్రెస్ నాయకుల సన్మానం

1చూసినవారు
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు: షబ్బీర్ కృషికి కాంగ్రెస్ నాయకుల సన్మానం
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కోట్లాది రూపాయల నిధులు సాధించారు. ఆయన నిరంతర కృషి ఫలితంగా వివిధ శాఖల నుంచి నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మంత్రి సీతక్కతో కలిసి షబ్బీర్ కు ఘన సన్మానం చేశారు. ఆర్&బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా షబ్బీర్ కృషి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్