కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం జూన్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు '30, 30(ఏ) పోలీసు యాక్ట్ 1861' అమలులో ఉంటుందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని ఆయన హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎస్పీ కోరారు.