ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ పోలీస్ స్టేషన్ లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. మహిళా నాయకురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జైల్ సింగ్, శ్రీరామ్, మహేష్, అనిల్ కుమార్, ఇతర కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వినతిపత్రం అందజేశారు. మహిళా నాయకురాలిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.