కామారెడ్డి: ఇందిరా మహిళా శక్తి భవనం పనులు త్వరితంగా జరగాలి

51చూసినవారు
కామారెడ్డి: ఇందిరా మహిళా శక్తి భవనం పనులు త్వరితంగా జరగాలి
నవంబర్ లోగా ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం పూర్తయేలా పనులలో వేగంపెంచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పంచాయతీరాజ్ ఇంజనీర్ ను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం కామారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళశక్తి భవన నిర్మాణం పనుల వేగం పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్