ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు వరం: మున్సిపల్ చైర్ పర్సన్

518చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు వరం: మున్సిపల్ చైర్ పర్సన్
కామారెడ్డి జిల్లా, కామారెడ్డి పట్టణంలోని రెండవ వార్డులో ఇందిరమ్మ పథకం ద్వారా లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లను మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ప్రారంభించారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఒక వరమని ఆమె తెలిపారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మోతిలాల్, 1వ వార్డ్ కౌన్సిలర్ గడ్డ మీది మహేష్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్