కామారెడ్డి జిల్లా, బిబిపేటలో మండల అధ్యక్షుడు పాత రాజు గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు వేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇల్లు కోసం ఇబ్బందులు పడుతున్నామని,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాత్విక, ఉపసర్పంచ్ చందుపట్ల ప్రశాంత్, మాజీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, జిల్లా నాయకులు భూమా గౌడ్, మహమ్మద్ సలీం, మండల యువజన అధ్యక్షుడు మల్లుగారి మహేష్, శ్రీకాంత్, ఆసిఫ్, రవి, పర్షా గౌడ్, సత్తయ పాల్గొన్నారు.