ఇందిరమ్మ ఇంటికి ముగ్గు: లబ్ధిదారుల ఆనందం

672చూసినవారు
కామారెడ్డి జిల్లా, బిబిపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేయడం జరిగింది. మండల అధ్యక్షుడు పాత రాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం పట్ల వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాత్విక, ఉపసర్పంచ్ చందుపట్ల ప్రశాంత్, మాజీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, జిల్లా నాయకులు భూమా గౌడ్, మహమ్మద్ సలీం, మండల యువజన అధ్యక్షుడు మల్లుగారి మహేష్, శ్రీకాంత్, ఆసిఫ్, రవి, పర్షా గౌడ్, సత్తయ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్