కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం, జబర్దస్త్ నటుడు చమ్మక్ చంద్ర ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన స్వగ్రామం గాంధారి మండలం వెంకటాపూర్ కావడంతో, జిల్లా ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. పిల్లలు కూడా ఆసక్తిగా సెల్ఫీలు తీసుకోవడంతో ఈ కార్యక్రమం మరింత సందడిగా మారింది.