మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్, రవి ఆకుపై స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ చిత్రాన్ని వేశారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన చూపిన ధైర్యం, ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సందేశం ఇచ్చారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని చూసి ప్రజలు బాస బాల్ కిషన్‌ను అభినందిస్తున్నారు.