కామారెడ్డి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా రఘు నిట్టు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంలో, కల్కినగర్‌లో ఆర్య క్షత్రియ సంఘం తరఫున ఆయనకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు అంబీర్ రాజేందర్ రావు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డికరి గోపాల్ రావు, రాజ్ కుమార్, వజీర్ అశోక్ రావు, కృష్ణమూర్తి,నారాయణ రావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.