కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేసింది. తాజాగా పట్టుబడిన 73 మంది వాహనదారులకు కోర్టు రూ.97,500 జరిమానా విధించింది. వీరిలో పది మందికి జైలు శిక్ష పడింది. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని SP రాజేశ్ చంద్ర హెచ్చరించారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.