జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన గల చెట్లు, పొదల్లో సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రత, ఎండిన గడ్డి కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో కలెక్టరేట్ భవనానికి మంటలు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. ఎండాకాలంలో ఎండిన గడ్డి, చెత్త కారణంగా తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారులు సూచించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.