అకాల మరణం చెందిన ఉమ్మడి మాచారెడ్డి మాజీ జడ్పీటీసీ, కామారెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ గ్యార లక్ష్మి (45) తన అవయవాలను దానం చేసి నలుగురికి ప్రాణదానం చేశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అనంతరం, ఆమె భర్త గ్యార సాయిలు, కూతుళ్లు అవయవ దానానికి అంగీకరించారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటని మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగారావు అన్నారు. పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు.