కామారెడ్డి: భారీ వర్షం.. కొట్టుకుపోయిన ధాన్యం

8చూసినవారు
కామారెడ్డి: భారీ వర్షం.. కొట్టుకుపోయిన ధాన్యం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం ఉదయం ఆకస్మికంగా కురిసిన గాలివానతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. దీంతో జంగంపల్లి కుర్డు, లక్ష్మాపూర్, రాంపూర్, కొట్టాల్ ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతకు వచ్చిన పంటలు నేలకొరగడంతో నష్టపోయిన అన్నదాతలు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్