కామారెడ్డి: 10 కి.మీ రన్నింగ్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన లక్ష్మీనారాయణ

71చూసినవారు
కామారెడ్డి: 10 కి.మీ రన్నింగ్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన లక్ష్మీనారాయణ
11వ తెలంగాణ స్టేట్ నేషనల్ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్- 2025 పోటీల్లో భాగంగా శనివారం హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించారు. ఉదయం జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలో గెరిగంటి లక్ష్మినారాయణ కామారెడ్డి జిల్లా తరపున 45+ వయస్సు వారిలో 10 కిలోమీటర్ల దూరాన్ని 47 నిమిషాల్లో పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి 4వ స్థానంలో నిలిచారు.

సంబంధిత పోస్ట్