రాజంపేట మండలంలోని అరగొండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ రైతు నిమ్మల విక్రాంత్ రెడ్డి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అరగొండ గ్రామానికి చెందిన విక్రాంత్ రెడ్డి, నెల రోజులుగా మొక్కజొన్నలు తెచ్చినా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదని, 30 మంది రైతులు తమ గింజలను అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల హామీతో ఆయన కిందకి దిగారు.