కామారెడ్డి డివిజన్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత (2025)కు సంబంధించి సర్పంచ్, వార్డ్ మెంబర్ల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉప జిల్లా ఎన్నికల అథారిటీ అధికారి, RDO వీణ తెలిపిన వివరాల ప్రకారం, డివిజన్ పరిధిలో 12 వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్ పదవీ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సోమవారం నలుగురు వార్డు మెంబర్ల పోటీదారులు తమ వద్ద అప్పీలు చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.