దేవునిపల్లి పిఎస్ పరిధిలోని గంజాయి కేసులో కామారెడ్డి పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో ఒడిశా వెళ్లిన ప్రత్యేక బృందం ఇద్దరు అంతరాష్ట్ర నిందితులు రాజు, దీపక్ లను అరెస్టు చేసింది. వీరి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువైన 12 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సోమవారం కోర్టులో హాజరు పరిచారు. డ్రగ్స్ రహిత జిల్లా కోసం తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ తెలిపారు.