ద్రోణి, గాలి అనిశ్చితి, ఉపరితల చక్రవాకం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు బుధవారం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో ఉక్కపోత వాతావరణం ఉంటుందని వెల్లడించింది.