రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీసేవ ఆపరేటర్ల నూతన కార్యవర్గం బుధవారం హైదరాబాద్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె. ప్రసాద్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి పట్టణానికి చెందిన చిలుక సత్యనారాయణని రాష్ట్ర కోశాధికారిగా నియమించడం జరిగింది. సత్యం మాట్లాడుతూ మీ సేవల సమస్యల మీద ప్రభుత్వంతో చర్చిస్తాం అని, మీ సేవ సెంటర్ లు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారం కోసం పాటుపడటం ఈ అసోసియేషన్ యొక్క లక్ష్యం అని తెలిపారు.