కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశానుసరం 9వ వార్డు కల్కినగర్ లో శుక్రవారం 195 బూత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మందుల చంద్రమౌళిని పట్టణ అధ్యక్షులు ఆకుల భరత్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పోతారాజు వెంకటేష్, పట్టణ ఉపాధ్యక్షులు రఘు నిట్టు, కౌన్సిలర్లు నరేందర్, శ్రీనివాస్ మరియు బస్వాలింగం, రాంచంద్రం, రాజేందర్, సతీష్ పాల్గొన్నారు.