కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్ గ్రామానికి చెందిన రాయల శ్రీనివాస్ గత 4 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు సుమారుగా రూ 3 లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది. వారి కుటుంబ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నదని తెలుసుకొని టేక్రియల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఉత్తునూరి రవి పాటిల్ తన వంతు సహాయంగా 10000/- ల ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేశారు.