కామారెడ్డిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిపారు. దీనిలో భాగంగా ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. చంద్రశేఖర్, ఎం. హెచ్. ఎం. ప్రోగ్రాం ఆఫీసర్ డా. రాధిక, వైద్యాధికారి డా. సాయి ఈశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.