తాడ్వాయి మండలంలోని చందాపూర్ గ్రామంలో చాకలి ప్రసాద్ (22) అనే యువకుడు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, పెరిగిన అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి, పది నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్న ప్రసాద్, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఈ నెల 2వ తేదీన తన వ్యవసాయ పొలంలో పారాక్వాట్ అనే గడ్డి మందు సేవించాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.