కామారెడ్డి జిల్లా, కామారెడ్డిలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో శ్రీ కన్యకా పరమేశ్వరి మాత జయంతి (మాఘ శుద్ధ దశమి) సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు, కుటుంబ సమేతంగా పాల్గొని ఘనంగా డోలారోహణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మార్కండేయ మందిరం నుండి దంపతులు మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకార సేవలు, రథోత్సవం, భజన కీర్తనలతో భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పూజారి శ్రీ మనోజ్ పాండే ప్రత్యేక పూజలు నిర్వహించారు.