ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మి నగర్‌లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, మంత్రి శ్రీ మహ్మద్ అజహరుద్దీన్, TGMREIS చైర్మన్ శ్రీ ఫహీం ఖురేషి ఆదివారం, 27 జూన్ 2026న ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ, సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.