బీజేపీలో పదవులు పొందిన నాయకులు నిత్యం ప్రజల మధ్యలో ఉండి పార్టీ కోసం, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్. పైడి ఎల్లారెడ్డి అన్నారు. గురువారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట్ మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి ఏర్పాటు చేసిన సత్కార సభలో పాల్గొని మాట్లాడారు. మోదీ 11 ఏళ్ల పరిపాలన గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు.