కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో చిరుత సంచారం కలకలం రేపింది. ఓ రైస్‌మిల్లులో చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చిరుతను చూసి మిల్లులోని ఒక కార్మికుడు భయాందోళనకు గురయ్యాడు. స్థానికులు మిల్లు ప్రాంగణంలో బోను ఏర్పాటు చేయాలని అధికారులు, అటవీ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.