కామారెడ్డి జిల్లాలో పోలీసులు జూదం స్థావరాలపై విస్తృత స్థాయిలో మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లాలోని 9 ప్రధాన ప్రాంతాలలో ఏకకాలంలో చేపట్టిన ఈ దాడులలో దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.2,06,390 నగదు, 48 సెల్ఫోన్లు మరియు 18 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలపై మొత్తం 9 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. జూదం అనేది ఆదాయ మార్గం కాదని, అది ఉన్న సంపదను హరించే వ్యసనమని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ప్రజలను హెచ్చరించారు.