పాల్వంచ మండలం ఎల్పుగొండ గ్రామానికి చెందిన నిమ్మ రమేశ్ (30) మద్యం సేవించి భార్యతో తరచూ గొడవలు పడుతుండటంతో, అతని భార్య వైష్ణవి పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ మనస్తాపంతో రమేశ్ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.