కొత్తపల్లిలో శుక్రవారం చెట్టు పైనుంచి పడి జంపయ్య (53) అనే వ్యక్తి మృతి చెందాడు. నవీపేట మండలం జన్నెపల్లి గ్రామానికి చెందిన జంపయ్య కొబ్బరి కాయలు తెంపుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తలకు బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.