కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో మంగళవారం చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దుండగులు 6.5 తులాల బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలు, సుమారు రూ.2.5 లక్షల నగదును అపహరించుకెళ్లారు. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లగా, తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి చోరీ జరిగినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగలను పట్టుకోవడానికి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.