మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు అభినందనలు తెలిపిన డీఈవో రాజు

1చూసినవారు
మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు అభినందనలు తెలిపిన డీఈవో రాజు
కామారెడ్డి జిల్లాలోని మాస్టర్ మైండ్స్ పాఠశాల విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఐటీ ఇండస్ట్రీ టూర్‌కు జిల్లా విద్యాధికారి (డీఈవో) రాజు అభినందనలు తెలిపారు. ఈ టూర్‌లో విద్యార్థులకు ఐటీ పరిశ్రమల పనితీరు, రోబోటిక్స్, టీ-హబ్‌లోని కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. టీ-హబ్ వేదికగా ప్రశంస పత్రాలు అందుకున్న విద్యార్థులను డీఈవో రాజు అభినందించారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.