
ఆకలితో ఏడుస్తోందని కూతురి గొంతు నులిమి చంపిన తండ్రి
పంజాబ్లోని జలంధర్లో దారుణం చోటుచేసుకుంది. ఆకలితో ఏడుస్తున్న ఐదేళ్ల కూతురిని కన్నతండ్రే గొంతు నులిమి చంపేశాడు. డ్రగ్స్ మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. చిన్నారి మేనమామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న అర్విందర్ సింగ్ అనే వ్యక్తి తన కూతురు నిహారిక (5) ఏడుపు ఆపలేదని నేలపై విసిరి, గొంతు నులిమి చంపినట్లు పోలీసులు తెలిపారు.




