దివ్యాంగులకు మంత్రి సీతక్క చేతుల మీదుగా సహాయ ఉపకరణాల పంపిణీ

221చూసినవారు
దివ్యాంగులకు మంత్రి సీతక్క చేతుల మీదుగా సహాయ ఉపకరణాల పంపిణీ
కామారెడ్డి జిల్లాలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం 28-04-2026న కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 64 మంది అర్హులైన దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఇతర సహాయక ఉపకరణాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్