
ఇంధన కొరతపై NHRCలో ఫిర్యాదు
తెలంగాణ, ఏపీ, తమిళనాడుతో పాటు కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఇంధన కొరతపై జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC)లో కేసు నమోదైంది. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత, ప్రజల ఇబ్బందులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కొరత రవాణా, అత్యవసర సేవలు, ప్రజల దైనందిన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీని నివారణకు ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.




