15న మంత్రి సీతక్క కామారెడ్డికి రాక

55చూసినవారు
15న మంత్రి సీతక్క కామారెడ్డికి రాక
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా ఇన్ ఛార్జ్  మంత్రి సీతక్క మంగళవారం కామారెడ్డికి వస్తున్నారు. ఉదయం 10గంటలకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగే వన మహోత్సవం పాల్గొననున్నారు. అక్కడినుంచి 10: 45 గంటలకు కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతి, భూభారతి సమస్యల పరిష్కారం, వ్యవసాయ శాఖకు సంబంధించి విత్తనాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షించనున్నారు.

సంబంధిత పోస్ట్