ముదిరాజులకు బీసీడీ నుంచి ఏలకు మార్చాలి.. ముదిరాజ్ జిల్లా కార్యదర్శి

2చూసినవారు
ముదిరాజులకు బీసీడీ నుంచి ఏలకు మార్చాలి.. ముదిరాజ్ జిల్లా కార్యదర్శి
కామారెడ్డి జిల్లా, బిబిపేట్ మండల్ బస్టాండ్ వద్ద శనివారం ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరి నర్సింలు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజులను బీసీడీ నుంచి ఏలకు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో ముదిరాజులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వం తమకు మద్దతుగా నిలబడకపోతే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముదిరాజులకు న్యాయం చేయకపోతే ప్రతి జిల్లా, ప్రతి మండలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్