కామారెడ్డి జిల్లా, కామారెడ్డిలోని అడ్లూర్ గ్రామం 2వ వార్డ్ లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకంలో భాగంగా, ఆమె లబ్ధిదారుల గృహప్రవేశానికి రిబ్బన్ కట్ చేసి, కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు మోతిలాల్, గడ్డమీది మహేష్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, లబ్ధిదారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.