కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మే 1, 2026న నిర్వహించిన మే డే వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కార్మికుల సేవలను కొనియాడుతూ, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని, వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, అడిషనల్ కలెక్టర్ మధు మోహన్, గృంథాలయ చైర్మన్ మద్ది చెంద్రకాంత్, వివిధ అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.