కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఏక్త దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వదేశీ సంస్థానాల విలీకరణకు కృషి చేసిన ఉక్కుమనిషి అని, మొదటి ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె కిష్టయ్య, ఎన్ సి సి అధికారి లెఫ్ట్నెంట్ డాక్టర్ ఏ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.