నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకూ తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.649 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రాజెక్టు అధికారి సాకేత్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం, రోజుకు సుమారు 168 క్యూసెక్కుల నీరు లీకేజ్, ఆవిరి అవుతోంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.