బీబీపేట మండలంలోని మహంకాళి ఆలయం వద్ద గల పెద్ద చెరువును అధికారులు గణేష్ నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఉపసర్పంచ్ ప్రశాంత్ కుమార్, వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కలిసి మంగళవారం చెరువు వద్దకు దారిని విద్యుత్ దీపాలతో సిద్ధం చేశారు. జేసీబీ సహాయంతో దారిని చదును చేసి, నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి దీపాలను అమర్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఉపసర్పంచ్ తెలిపారు.