కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలసిన శ్రీ వైద్యనాధేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం ఘనంగా లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు వేద పండితులు గంగవరపు ఆంజనేయ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, శ్రీ వైద్యనాధేశ్వర స్వామి వారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం చాలా శుభప్రదమని, స్వామి వారు కోరిన కోరికలు తీర్చుతారని తెలిపారు. స్వామివారికి జరిగే నిత్య కార్యక్రమాల్లో భక్తులు పాల్పంచుకోవాల్సిందిగా కోరారు.