కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం ఇస్సానగర్ గ్రామంలో బుధవారం 22 సంవత్సరాల తర్వాత ఊరడమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ పండగను చూడటానికి గ్రామ ప్రజలందరూ తరలివచ్చారు. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ కలిసి పండగను కొనసాగించాలని గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవత ఊరడమ్మ ప్రత్యక్షమై, గ్రామంలో పాడిపంటలు, గుడ్డు, గోదా వంటివి వృద్ధి చెందుతాయని చెప్పినట్లు సమాచారం. ఈ పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.