
బుండిబుగ్యో ఎబోలాకు రష్యా వ్యాక్సిన్!
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ఆందోళనల నేపథ్యంలో, రష్యా కీలక ప్రకటన చేసింది. బుండిబుగ్యో ఎబోలాకు వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ఆరోగ్య మంత్రి మురాష్కో పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలోని రష్యా దౌత్యకార్యాలయం ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. రష్యన్ శాస్త్రవేత్తలు కొత్త ఎబోలా స్ట్రెయిన్ కోసం విజయవంతమైన వ్యాక్సిన్‌ను కనుగొన్నారని, ఇది బుండిబుగ్యో స్ట్రెయిన్ నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపింది.




