బీబీపేట్ లో కొండా లక్ష్మణ్ బాపూజీకి పద్మశాలీల ఘన నివాళి

564చూసినవారు
బీబీపేట్ లో కొండా లక్ష్మణ్ బాపూజీకి పద్మశాలీల ఘన నివాళి
బీబీపేట్ మండలంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్బంగా బీబీపేట్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంకాలం నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్, హెచ్. డబ్ల్యూ. సి. ఎస్, బీబీపేట్ చైర్మన్ అల్వాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ తుమ్మ రవీందర్ లు పాల్గొని బాపూజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుమ్మ మచ్చేందర్ మాట్లాడుతూ బాపూజీ జీవితకాలం సమాజసేవకు అంకితమైందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్